డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లి... దొంగ పెళ్లి చేసుకున్న శృతి హరిహరన్
యాక్షన్
కింగ్ అర్జున్‌పై సంచలన ఆరోపణలు చేసిన కన్నడ నటి శృతి హరిహరన్‌కు సంబంధించి ఓ
రహస్య విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదని
చెప్పుకుంటూ రాగా అది అబద్ధమని తేలింది.
ప్రస్తుతం
ఆమె స్నహితుడుగా పేర్కొంటున్న వ్యక్తి ఆమె భర్తేనని తేలింది. ఈయనే ఆమెకు డాన్స్
నేర్పిన వ్యక్తి. అతని వద్ద డ్యాన్స్ నేర్చుకొనేందుకు వెళ్లిన శృతి అతనితో ప్రేమలో
పడింది. సదరు వ్యక్తిని ఆమె వివాహం కూడా చేసుకుందని.. కానీ ఇండస్ట్రీలో అతను
శృతికి స్నేహితుడిగా మాత్రమే చెప్పుకుంటూ వచ్చింది.
ఈ నేపథ్యంలో
అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆమె చేసిన ఫిర్యాదుపై కూడా ఇపుడు అనుమానాలు
ఉత్పన్నమవుతున్నాయి. ఆమె ఫిర్యాదుతో అర్జున్‌పై బెంగుళూరులోని కబ్బన్ పార్క్
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఆ ఫిర్యాదు కాపీలో ఆమెకు పెళ్లయిందని.. తన
భర్తను పేరును కూడా పేర్కొంది. దీనిప్రకారం శృతికి గతంలోనే పెళ్లయిందని
తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచినట్టు సమాచారం. పెళ్లి వార్త
బయటకు తెలిస్తే అవకాశాలు రావని ఆమె భావించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు
తెలుస్తోంది.
డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లి... దొంగ పెళ్లి చేసుకున్న శృతి హరిహరన్
Reviewed by Popcorn Telugu
on
October 29, 2018
Rating:
No comments